Wednesday, March 11, 2026
Homeసినిమాచెప్పిన టైమ్ కే వస్తానంటున్న ‘ఆచార్య’

చెప్పిన టైమ్ కే వస్తానంటున్న ‘ఆచార్య’

Acharya on time:
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందంటూ నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లను నిర్మాత‌లు ఖండించారు.

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ “ ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. అంద‌రి అంచ‌నాల‌కు త‌గిన‌ట్లే ఆచార్య సినిమా ఉంటుంది” అన్నారు.

Also Read : ‘ఆచార్య‌’ నుంచి ‘సిద్ధ’ టీజర్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular