Monday, June 15, 2026
HomeTrending Newsపెదగార్లపాడులో సిమెంట్ ప్లాంట్

పెదగార్లపాడులో సిమెంట్ ప్లాంట్

Major Industry in AP:
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కానుంది.  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది.  24 నెలల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.  ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్‌ ఏర్పాటు చేసిన శ్రీ సిమెంట్‌ గ్రూప్ ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్‌  నెలకొల్పబోతోంది. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌ కలిసి ఈ విషయమై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై శ్రీ సిమెంట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ కు సిఎం వివరించారు.

రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని,  ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగులకోసం ముఖ్యమంత్రి కూడా అలాగే పనిచేస్తున్నారని శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్‌ వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని, రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారని దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఆదాయాలు రావాలన్నది సీఎం ఉద్దేశమని అయన వివరించారు. శ్రీ సిమెంటు ప్లాంటులో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నామని, రోజువారీ ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా డబ్బును వారికి ఇస్తున్నామని పేర్కొన్నారు. పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటు వల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌ అన్నారు.  పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీ పి వి.మిథున్‌ రెడ్డి, శ్రీ సిమెంట్‌ ప్రెసిడెంట్‌ (కమర్షియల్‌) సంజయ్‌ మెహతా, జీఎం జీవీఎన్‌.శ్రీధర్‌ రాజు, మేనేజర్‌ వెంకటరమణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు

Also Read : కనీస మద్దతు ధర అందించాలి: సిఎం ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular