Maoists Kidnap Former Sarpanch
ములుగు జిల్లాలో మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సర్పంచ్ రమేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఛత్తీస్ గడ్ అడవుల్లోకి తీసుకెల్లినట్టు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్న బార్య పిల్లలు.
Also Read : రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు