CM visit to Kadapa district: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటినుంచి మూడురోజులపాటు వైఎస్సార్ కడపజిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేస్తారు. గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనే సిఎం ప్రొద్దుటూరు, పులివెందులలో బహిరంగసభల్లో ప్రసంగిస్తారు.
నేటి పర్యటనలో మొదట ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి , అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని ప్రాజెక్ట్ కాలనీ-1లో సెంచరీప్లై పరిశ్రమకు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకొని వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చి ప్రారంభిస్తారు. సాయంత్రం ఇడుపులపాయ చేరుకుని వైఎస్‌ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు.
రేపు వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పార్క్ లో ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ చేసి బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం ఇడుపులపాయ చేరుకుని వైఎస్‌ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేస్తారు.
డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొంటారు. అనంతరం కడప ఎయిర్‌పోర్ట్ కు నుంచి గన్నవరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
Also Read : కేరళ కాంగ్రెస్ చీఫ్ పిటి థామస్ కన్నుమూత