Inter First Year Students :
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. కాగా,ఇటీవల ప్రకటించిన ఫస్టియర్ ఫలితాల్లో 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్లో ఈ రోజు కీలక ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, దీంతో విద్యార్థులు ఎంతో నశ్రపోయారన్నారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ లో 70% సిలబస్తో ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చామన్న మంత్రి 4,59 లక్షల మంది పరీక్ష రాస్తే 2.24 లక్షల మంది దాదాపు 49% పాసయ్యారని తెలిపారు. గత రెండేళ్లుగా కరోనాతో విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించలేని పరిస్థితిలోనే ప్రమోట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు పై అకారణంగా నిందలు వేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యమన్నారు. 2.35 లక్షల ఫెయిలైన వారిలో 30 మార్కులు కలిపితే 83 వేల మంది మాత్రమే పాసవుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు.