RRR on OTT?
ఆర్ఆర్ఆర్.. సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రమిది. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా కావడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
అయితే.. కరోనా కారణంగా చాలా సార్లు ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. ఇక అడ్డంకులు అన్నీ దాటుకుని ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులకు ముందుకు వస్తుంది అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ కరోనా థర్డ్ వేవ్.. ఓమిక్రాన్ అంటూ టెన్షన్ పెడుతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ అనుకున్నట్టుగా జనవరి 7న విడుదల అవుతుందా..? లేదా..? అనేది టెన్షన్ గా మారింది. ఇదిలా ఉంటే.. నార్త్ లో ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో నైట్ కర్ఫ్యూలు స్టార్ట్ చేశారు. ఢిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి.
ఓ వైపు ఆర్ఆర్ఆర్ వాయిదా అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం ప్రమోషన్స్ లో స్పీడుగా దూసుకెళుతుంది. చెన్నైలో చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. మరి.. ఓమిక్రాన్ కేసులు ఇంకా పెరిగితే.. ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందా..? ఏం జరగనుంది అంటే.. జక్కన్న దగ్గర మరో సూపర్ ప్లాన్ ఉందట. అది ఏంటంటే.. థియేటర్లోను, ఓటీటీలోను ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రమోషన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read : చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ ను లీక్ చేసిన రాజమౌళి