High Court On New Year Celebrations :
క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా కరోనా నియంత్రణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం బేఖాతరు చేసిందని హైకోర్టులో పెటిషన్ దాఖలు అయింది. ఈ రోజు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వ తీరును తప్పు పడుతూ వాదనలు వినిపించారు. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ న్యూఇయర్ వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అన్న పిటిషనర్.
ఇతర రాష్ట్రాల మాదిరి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్యాండమిక్,ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని, ప్రభుత్వం ఓమిక్రాన్ ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలకు ఇష్టానుసారంగా అనుమతి ఇచ్చిందన్న పిటిషనర్. తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని కోర్ట్ కు వివరించిన పిటిషనర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు పెట్టాలని కోరారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
Also Read : ఢిల్లీలో కరోనా ఆంక్షలు