Saturday, November 23, 2024
HomeTrending Newsవిభజన చట్టమే ప్రాతిపదిక - కెసిఆర్

విభజన చట్టమే ప్రాతిపదిక – కెసిఆర్

విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంటేనే సహకరించాలని, లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం “రాష్ట్ర పునర్విభజన” చట్టానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని సమావేశంలో స్పష్టం చేయాలని సిఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈనెల 12వ తేదీన “మినిస్టర్ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా” సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీల సమావేశంలో అనుసరించాల్సిన విధి విధానాల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు సూచనలు ఆదేశాలిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం లేని వివాదాలు సృష్టిస్తూ.. విభజన చట్టంలో లేని అంశాలను కావాలని ముందుకు తెస్తున్నదని, సింగరేణి లాంటి సంస్థలలో వాటా కావాలని గొంతమ్మ కోరికలు కోరడం మూలంగానే ఇప్పటికే పరిష్కారం కావల్సిన అనేక అంశాలు, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని సిఎం కెసిఆర్ కు అధికారులు వివరించారు.

విభజన చట్టంలోని షెడ్యూళ్లు 9 మరియు 10 లోని అంశాలపై గతంలో అనుసరించిన విధంగానే ముందుకు పోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. జనవరి 12 నాటికి కరోనా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమావేశం పై నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్