Saturday, November 23, 2024
HomeTrending Newsవిశాఖ-భోగాపురం హైవేకు సిఎం వినతి

విశాఖ-భోగాపురం హైవేకు సిఎం వినతి

CM met Gadkari: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండోరోజు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు రహదారుల అభివృద్ధి, విస్తరణపై చర్చించారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరుచేసినందుకు గడ్కరీకి సిఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై కూడా చర్చిచారు.  విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సిఎం తెలిపారు. సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్టుల నుంచి ఈ రోడ్డు వెళ్తుందని గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందన్నారు.  విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని మంజూరు చేయాలని సిఎం కోరారు.

విజవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కోరిన సిఎం, సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని వివరించారు. ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామని తెలిపారు.

కత్తిపూడి – ఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డుగా విస్తరించాలని సిఎం జగన్ కోరారు. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్‌ కారణంగా మళ్లీ ట్రాఫిక్‌జామ్స్‌ ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

Also Read : కేంద్ర మంత్రులతో సిఎం జగన్ భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్