Friday, March 13, 2026
Homeసినిమాప్ర‌భాస్ 25వ చిత్రం స్పిరిట్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

ప్ర‌భాస్ 25వ చిత్రం స్పిరిట్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

Prabhas role in Spirit: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. దీని తర్వాత ప్ర‌భాస్ ‘ఆదిపురుష్‌’, ‘స‌లార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ చిత్రాల‌ను చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. అయితే.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే స్పిరిట్ మూవీ ప్ర‌భాస్ కి 25వ చిత్రం కావ‌డం విశేషం.

అయితే.. ఈ క్రేజీ మూవీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇది ఏ త‌ర‌హా చిత్రం..?  ఇందులో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?  ఇలా అనేక ప్ర‌శ్న‌లు. బాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్.. అలాగే ప్రభాస్ ఆదిపురుష్, స్పిరిట్ చిత్రాల‌కు నిర్మాత అయినటువంటి భూషణ్ కుమార్ లేటెస్ట్ ఇంటర్ వ్యూలో స్పిరిట్ మూవీకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. అది ఏంటంటే.. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తార‌ని తెలియ‌చేశారు. అభిమానులు ఎప్ప‌టి నుంచో ప్ర‌భాస్ ని పోలీస్ పాత్ర‌లో చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాతో అభిమానుల కోరిక తీరబోతుంది. అయితే.. ఈ సినిమా తెర పైకి రావాలంటే..కొంత కాలం ఆగాల్సిందే.

Also Read : విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ‘రాధేశ్యామ్’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular