Saturday, November 23, 2024
HomeTrending Newsకులగణన జరగాల్సిందే - బీసీ కమిషన్

కులగణన జరగాల్సిందే – బీసీ కమిషన్

దేశంలో చేపట్టబోయే జనగణనలో (census) కులగణన తప్పకుండా జరగాలని బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతులకు విద్యా , ఉపాధి , ఉద్యోగ మరియు రాజకీయ రంగాలలో న్యాయం జరగాలంటే కులగణన జరిపి ఆయా వర్గాల దామాశ ప్రకారం వారికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ అభివృద్ధి రంగాలలో వాటా దక్కుతుందన్నారు. హైదరాబాద్  lb నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణన చేయడం సాధ్యం కాదని సుప్రీం కోర్టులో చెప్పటం అత్యంత బాధా కరం అన్నారు. దేశంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాక కలెల్కర్ , మండల్ కమిషన్ మరియు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిషన్ లు అనేక రాష్ట్రాల హైకోర్టు లు, సుప్రీం కోర్టు కూడా అనేక కేసుల విచారణ సమయంలో కులగణన చేయాల్సిందే అని చెప్పినపటికి ఇప్పటికీ ఇది జరగకపోవడం అత్యంత విచారకరమన్నారు.

దేశంలో 55% పైగా ఉన్న బీసీలను అభివృద్ధికి దూరంగా ఉంచడం కోసం అవకాశాలు దక్కకుండా చేయడం కోసమే
కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఉపేంద్ర విమర్శించారు. దేశంలో పులులు, సింహాలు, ఏనుగులు ఇలా అన్ని జంతువుల సంఖ్య లెక్కించగల్గిన కేంద్ర ప్రభుత్వం బీసీ ల జనగణన చేపట్టకపోవడం బీసీ ల ఆత్మ గౌరవం దెబ్బతీయడమే అన్నారు. రాబోయే కాలంలో బీసీ లు అందరూ సంగటితం అయి ఈ డిమాండ్ తో ముందుకు సాగాలని ఉపేంద్ర పిలుపు ఇచ్చారు.

Also Read : క్రిమిలేయర్ తో ఓబిసి లకు నష్టం

RELATED ARTICLES

Most Popular

న్యూస్