Only on theaters: కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. పోస్టర్స్, గ్లింప్స్ తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీ డీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చాలా వరకు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ విక్రాంత్ రోణ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయడానికి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిందట. ఏకంగా రూ.100 కోట్లు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినప్పటికీ ‘విక్రాంత్ రోణ’ మేకర్స్ సింపుల్‌గా నో చెప్పేశారు.
భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో హై టెక్నికల్ వేల్యూస్‌తో ‘విక్రాంత్ రోణ’ రూపొందుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్ రోణా మల్టీలింగ్వుల్ యాక్షన్ అడ్వంచర్. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేస్తున్న ఈ సినిమాను అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మాతలు. అలంకార్ పాండ్యన్ సహ నిర్మాత. దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రతినిధులకు ‘విక్రాంత్ రోణ’ మేకర్స్ స్పెషల్ షో ప్రదర్శించారు. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీ రాలేదని ఓటీటీ ప్రతినిధులు ‘విక్రాంత్ రోణ’ దర్శక నిర్మాతలకు కితాబిచ్చారట. అదే సమయంలో కిచ్చా సుదీప్ పెర్ఫామెన్స్ నెక్ట్స్ రేంజ్లో ఉందని కూడా వారు అభినందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మాతలకు ఈ క్రేజీ ఆఫర్‌ను ఇచ్చింది. కానీ ‘విక్రాంత్ రోణ’ మేకర్స్ వారి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.