Sunday, June 14, 2026
Homeసినిమాఫస్టు లుక్ తో అదరగొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్!

ఫస్టు లుక్ తో అదరగొట్టేసిన ఎనర్జిటిక్ స్టార్!

Ram as Warrior: టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోగా రామ్ కనిపిస్తాడు. చూడటానికి తాను చాలా స్మార్ట్ గా కనిపిస్తాడు. కానీ ఆయన చాలా కాలంగా మాస్ ఇమేజ్ కోరుకుంటూ వస్తున్నాడు. మొత్తానికి ఆయన ప్రయత్నం ఫలించి, అలాంటి క్యారెక్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో పడింది. ఆ సినిమాలో ఆయన తన బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని మొత్తం మార్చేశాడు. ఇక మంచి డాన్సర్ కనుక, ఊర మాస్ పాటలకు డాన్సులతో స్టెప్పులు అదరగొట్టేశాడు. ఇప్పుడు అదే ఎనర్జీతో ఆయన మరో సినిమా చేస్తున్నాడు.

లింగుసామి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తమిళంలో మాస్ యాక్షన్ సినిమాలకి లింగుసామి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తాడు. రామ్ తో ఆయన సెట్స్ పైకి వెళ్లి చాలాకాలమే అయింది. అయితే వివిధ కారణాల వలన షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి ‘ది వారియర్’ అనే టైటిల్ ను ఖరారు చేసి, రామ్ ఫస్టులుక్ ను వదిలారు. ఈ సినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు ముందుగానే వార్తలు వచ్చాయి. అందుకు తగినట్టుగానే ఈ పోస్టర్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు.

టైటిల్ ను బట్టే ఈ సినిమా పక్కా యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. అన్బు – అరివు కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పటికే ‘ఉప్పెన’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన కృతి శెట్టి, రామ్ జోడీగా అలరించనుంది. రెండవ కథానాయికగా అక్షర గౌడ నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular