Wednesday, June 17, 2026
Homeసినిమాప్రభాస్ రేంజే వేరు .. 20 కోట్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్

ప్రభాస్ రేంజే వేరు .. 20 కోట్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్

Prabhas – Range: ప్రభాస్ పేరు ఇప్పుడు పవర్ఫుల్ మంత్రంగా మారిపోయింది. మాస్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ .. వేలకోట్ల బిజినెస్. బాలీవుడ్ బడా హీరోలను సైతం ఆయన పేరు కంగారు పెట్టేస్తోంది. అలాంటి ప్రభాస్ తాజా చిత్రంగా ‘సలార్’ రూపొందుతోంది. ‘కేజీఎఫ్’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమా కోసం ఆ మధ్య ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ యాక్షన్ ఎపిపోడ్ కోసం దాదాపు 20 కోట్ల వరకూ ఖర్చు చేశారట. ప్రీ క్లైమాక్స్ గా వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు. విలన్ గ్యాంగ్ పై ప్రభాస్ విరుచుకుపడే ఈ సీన్ రన్ అవుతున్నంత సేపు, ఒక హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్టుగా ఉంటుందట. ఆ స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేయించాడని చెబుతున్నారు.

ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. ఆ స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ .. ఆషిక రంగనాథ్ అనే కన్నడ బ్యూటీ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. ప్రభాస్ నుంచి ‘రాధే శ్యామ్’తో పాటు ‘సలార్’ కూడా ఇదే ఏడాదిలో రానుంది. ఇక ‘ఆది పురుష్’ కూడా ఈ ఏడాదిలోనే రానున్న సంగతి తెలిసిందే.

Also Read : ఎదుటివాళ్ల కష్టం చూడలేని ప్రభాస్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular