Sweet Memories: విలక్షణ నటుడు ప్రకాష్… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయడం… ఆతర్వాత ఓడిపోవడం తెలిసిందే. ఆతర్వాత కొన్ని రోజులు యాక్టీవ్ గా ఉన్నా… ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆయన తన సినిమాల కన్నా… తన ట్వీట్స్ తో ఎక్కువగా వార్తల్లో ఉంటుంటారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శలు చేయడం ఆయనకు మామూలే. అయితే… ఆయన తెలంగాణలో ఉంటున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చేసే మంచి పనులు గురించి ట్వీట్స్ చేస్తూ వార్తల్లో ఉంటుంటారు.
ఇప్పుడు ఊహించని విధంగా తీపి గుర్తులు అంటూ 2004లో నంది అవార్డు అందుకున్న ఫొటోను ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురితో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
“డా.రాజశేఖర్ రెడ్డి గారు, డా.దాసరి నారాయణరావు గారు.. డా.గుమ్మడి గారి.. ఆ స్పర్శ ఆహా అంటూ ప్రకాశ్ రాజ్ స్పందించారు. కాగా, ప్రకాశ్ రాజ్ తన కెరీర్‌లో ఎనిమిది నంది అవార్డులు అందుకున్నారు. దేశంలోని పలు భాషల చిత్రాల్లో నటించి మెప్పించారు.
అయితే… ఆయనకు ఉన్నట్టుండి వై.ఎస్ గుర్తుకురావడం ఏంటి..? నంది అవార్డ్ అందుకున్న ఫోటోను పోస్ట్ చేయడం ఏంటి..? అనేది ఇటు సినీవర్గాల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను ఆసక్తిగా మారింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి… ప్రకాష్ రాజ్ ట్వీట్స్ వెనుకున్న అసలు విషయం ఏమిటో.. ఆయనకే తెలియాలి.
Also Read: పట్టాలెక్కని వ్యాకరణం