Monday, September 23, 2024
HomeTrending Newsడ్రగ్స్ నియంత్రణపై రేపు కాన్ఫరెన్స్

డ్రగ్స్ నియంత్రణపై రేపు కాన్ఫరెన్స్

Seminar on Drugs:  రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  ఈనెల 28న శుక్రవారం ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరపాలని సిఎం నిర్ణయించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.

రేపు సిఎం అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సిఎస్, డిజిపి, డిజీలు, అన్ని  జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డిసిపీ అధికారులు, రాష్ట్ర ఎక్సైజ్  పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో  మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , డిజిపి మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎంవో ఉన్నతాధికారులు తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల అమలకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా  దాదాపు 1000 (వెయ్యి) మంది తో కూడిన ప్రత్యేకంగా “నార్కొటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ’’ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ని సిఎం కెసిఆర్ ఆదేశించారు.  ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డిజిపి ఆధ్వర్యంలో, డ్రగ్స్ ను మరియు వ్యవస్థీకృత నేరాలను  నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్