Real-Dandupalyam: రామానాయక్ సమర్పణలో శ్రీవైష్ణోదేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
టియఫ్‌పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ “మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో ‘దండు పాళ్యం’ గత సిరీస్ లో చూపించారు కానీ ఈ రియల్ దండుపాళ్యంలో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్రవరి 4న వస్తోన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి” అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ “దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా ‘రియల్ దండుపాళ్యం’ చిత్రం ఉండబోతుందని అనిపిస్తోంది. ఈ చిత్రం సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకరావాలని కోరుకుంటున్నా” అన్నారు.
నటి రాగిణి ద్వివేది మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. డైరక్టర్ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమాను ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. గతంలో వచ్చిన సిరీస్ కన్నా ‘రియల్ దండుపాళ్యం’ అద్భుతంగా ఉండబోతుంది. తెలుగులో తొలి సారి విడుదలవుతోన్న నా యాక్షన్ సినిమా ఇది. ఎంతో ఎగ్జైయిటింగ్ గా ఉంది. తెలుగులో మరో పెద్ద చిత్రంలో నటించాను. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి. ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న రియల్ దండుపాళ్యం చిత్రాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా” అన్నారు.