K3_kotikokkadu: తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కే3 కోటికొక్కడు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కన్నడలో ఈ సినిమా రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
ఈ చిత్రాన్ని తెలుగులో ఫిబ్రవరి 4న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ లో సుధీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్-సుదీప్ జోడి చూడముచ్చటగా ఉంది. ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. యాక్షన్ ప్యాక్ డ్ గా రిలీజైన కే3 కోటికొక్కడు తెలుగు ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గుడ్ సినిమా గ్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది.
Also Read : విడుదలకు సిద్దమైన ‘ట్యాక్సీ’