Thursday, June 11, 2026
Homeతెలంగాణఆన్‌లైన్ లో ఆర్జిత సేవ‌లు

ఆన్‌లైన్ లో ఆర్జిత సేవ‌లు

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల సౌకర్యం కోసం ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునే ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ. తెలంగాణలోని మొత్తం 38 ప్రముఖ దేవాలయాలలో ఈ సౌలభ్యం అందుబాటులో ఉందని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ వెల్లడించారు. కరోనా సమయంలో…. లాక్ డౌన్ తో గుడికి నేరుగా వెళ్ళలేని వారు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ ద్వారా అర్చ‌న‌, పూజ సేవ‌ల‌ను ఊప‌యోగించుకోవాల‌ని కోరారు.

Tapp Folio మొబైల్ యాప్, https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm మీ సేవ‌ పోర్ట‌ల్ లో ఆన్‌లైన్ పూజ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని సూచించారు.

ఆన్ లైన్ పూజలు నిర్వహించే ఆలయాల జాబితాలో 38 ప్రధాన ఆలయాలు ఉన్నాయ‌ని, వాటిలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు హనుమాన్‌ దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు కూడా ఉన్నాయని తెలియ జేశారు.
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular