Saturday, November 23, 2024
HomeTrending News2022 ఖరీఫ్ కు పోలవరం : అనిల్

2022 ఖరీఫ్ కు పోలవరం : అనిల్

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్  స్పష్టం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మూడేళ్ళ పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, చివరి రెండేళ్ళు హడావుడి చేసిందని అనిల్ ఆరోపించారు.  టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తూ, దద్దమ్మల్లా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కోవిడ్ కష్టకాలంలోనూ ధైర్యంగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నామని, పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలో మొత్తం 80 మంది సిబ్బంది కోవిడ్ కారణంగా మరణించినా ఎక్కడా పనులు ఆపలేదని మంత్రి వెల్లడించారు.  ఏడాదికి పైగా కోవిడ్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉన్నా, వేలాది మంది కార్మికులు ధైర్యంగా నిరాతరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారని వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, వారిని కించపరిచే విధంగా మాట్లాడటం మంచిది కాదని మంత్రి హితవు పలికారు.

గత ఏడాదిన్నర కాలంలో, చంద్రబాబు, ఆయన కొడుకు పట్టుమని పది రోజులు కూడా బయటకు రాలేదని, వారివేనా ప్రాణాలు, అధికారులవి, కార్మికులవి ప్రాణాలు కాదా..? అని అనిల్ ప్రశ్నించారు.  కోవిడ్ లోనూ కుటుంబాలను వదిలేసి పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు అనిల్.

పోలవరం ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి కూడా అధికారులతో అనిల్ సమీక్షించారు. 17 వేల ఇళ్ళను ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనుకున్నామని . కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో వేలల్లో కేసులు వస్తున్నండుబ్న పని చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉందని వెల్లడించారు. ఎన్ని సమస్యలు ఉన్నా, కచ్చితంగా ఈ సీజన్ లో నూటికి నూరు శాతం వారికి పునరావాసం కల్పించి తీరుతామని అనిల్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్