Saturday, November 23, 2024
HomeTrending Newsమోడీ తెలంగాణ ద్రోహి - రేవంత్ రెడ్డి

మోడీ తెలంగాణ ద్రోహి – రేవంత్ రెడ్డి

పార్లమెంటు లో ప్రధాని ప్రసంగం, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ లో విమర్శించారు. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని, తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని ఆరోపించారు. మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని, గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ కి ఉందని రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997 లో కాకినాడలో తీర్మానం చేసింది బిజెపి అని మలి ఉద్యమంలో బలి అయిన అమరులకు మోడీ క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారని, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విభజన కోసం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారని, ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరం అన్నారు.

పార్లమెంట్ లో బిల్లులు ఓటింగ్ జరగాల్సి వస్తే, సభ తలుపులు మూస్తారని, ఇది చట్ట ప్రక్రియ జరిగే విధానమని రేవత్ వివరించారు. ఆంద్రప్రదేశ్ ప్రజలను సైతం మోడీ వంచించాడని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. బంగాళాఖాతంలో దూకి ప్రధాని ఆత్మహత్య చేసుకోవాలన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేయకుండా, మోడీ వెనుక దాక్కున్నాడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.

మోడీ తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి అని నిరూపించుకున్నాడని, మోడీ మాట్లాడుతుంటే టీఆరెస్ ఎంపీలు నోరెత్తటం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు.

Also Read : ఏపి పునర్విభజనపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్