Sunday, January 19, 2025
Homeసినిమాచైతు స‌ర‌స‌న పూజా హేగ్డే?

చైతు స‌ర‌స‌న పూజా హేగ్డే?

Once Again: యువ  సామ్రాట్ నాగ‌చైత‌న్య ఇటీవ‌ల బంగార్రాజు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. ఆ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ సక్సెస్  సాధించ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య థ్యాంక్యూ మూవీ చేస్తున్నారు. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య నెక్ట్స్ మూవీలో క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించనున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏ సినిమాలో అంటే… నాగ‌చైత‌న్య, త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో చైతు స‌ర‌స‌న న‌టించేందుకు పూజా హేగ్గే క‌రెక్ట్ గా సెట్ అవుతుంద‌ని ఆమెని కాంటాక్ట్ చేశార‌ని తెలిసింది.

పూజా హేగ్డే.. నాగ‌చైత‌న్య ‘ఒక లైలా కోసం’ సినిమాతోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అయ్యింది. అయితే… ఆ సినిమా ఆశించిన స్ధాయిలో మెప్పించ‌లేదు. మ‌రి.. ఈ సినిమాతో చైతు, పూజా క‌లిసి బ్లాక్ బ‌స్ట‌ర్ సాధిస్తారేమో చూడాలి.

Also Read : నాని ‘దసరా’ చిత్రం ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్