Friday, November 22, 2024
HomeTrending Newsఅమూల్ తో అక్కచెల్లెమ్మలకు లబ్ధి: జగన్

అమూల్ తో అక్కచెల్లెమ్మలకు లబ్ధి: జగన్

పాదయాత్రలో పాడి రైతుల కష్టాలు చూశానని, వారికి ఇచ్చిన హామీ మేరకే అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ పనికి శ్రీకారం చుట్టామని తెలిపారు. లాభాపేక్ష లేకుండా పాడి రైతులకు సేవలు అందించేందుకు అమూల్ సంస్థ ముందుకొచ్చిందని, పాడి రైతులకు 10 రోజులకు ఒకసారి బిల్లుల చెల్లింపు జరుగుతుందని సిఎం వివరించారు.

పాల రైతుల కోసం ఈ రెండేళ్లలో 4 వేల కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. గతంలో కొన్ని ప్రైవేటు డెయిరీలు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం సహకార రంగాన్ని నిర్వీర్యం చేశాయని ముఖ్యమంత్రి విమర్శించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల ఉత్పత్తి సేకరణను ముఖ్యమంత్రి జగన్ నేడు వర్చువల్ గా ప్రారంభించారు. 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని 9,898 గ్రామాలకు అమూల్ సేవలను విస్తరిస్తామని జగన్ చెప్పారు. అమూల్ సంస్థలో వాటాదారులంతా పాలుపోసే అక్కచెల్లెమ్మలేనని, దీని ద్వారా పాదిరైతులకు మంచి లాభాలు వస్తాయని వివరించారు.

ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల ద్వారా మనం పోసే పాల నాణ్యత ఎంతో అక్కడే తెలిసిపోతుందని. దానికి తగ్గట్లుగానే రేటు వస్తుందని చెప్పారు. గతంలో కూడా నాణ్యత చూసేవారని, కానీ మోసం చేసేవారని, కానీ ఇప్పుడు అమూల్ సంస్థ మోసం చెయ్యట్లేదు కాబట్టి లీటరుకు 5 సుంచి 15 రూపాయలు ఎక్కువగా పొందగలుగుతారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంతమంది మహిళలు సిఎంతో నేరుగా సంభాషించారు. అమూల్ ద్వారా తాము ఆర్ధికంగా బాగుపడతామని సిఎంకు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్