Monday, March 16, 2026
HomeTrending Newsసచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత

సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేత

అమరావతి సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ఆదేశించింది. ఈ మేరకు సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులూ సచివాలయానికి రావాలని ఆదేశించింది. సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సీఎస్ ఆదేశాల్లో తెలిపారు.

ఉన్నతాధికారులూ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ విధానం పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సమావేశాలకూ భౌతికంగా హాజరుకావాలని పేర్కొన్నారు. సీఎస్‌, మంత్రుల సమీక్షలకూ భౌతికంగానే హాజరుకావాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular