Sunday, June 14, 2026
Homeసినిమామార్చి 4న ‘సెబాస్టియన్‌ పిసి 524’

మార్చి 4న ‘సెబాస్టియన్‌ పిసి 524’

Sebastian coming: జ్యోవిత సినిమాస్‌ పతాకం పై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా న‌టించిన సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాన్ని సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న ఈ సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ చిత్రాల విజయంతో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరంకు మా ‘సెబాస్టియన్‌ పిసి524’ ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుంది. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా “హెలి”అనే పాటకు మేము అస్సలు ఊహించలేనటువంటి రెస్పాన్స్ ప్రేక్షకులనుండి లభించింది. ఇటీవలే విడుదలైన గ్లిమ్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉంది.

ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular