Sunday, June 14, 2026
Homeసినిమాకరోనా వేళ ఆసరా అందిస్తున్న జీవన్ కుమార్

కరోనా వేళ ఆసరా అందిస్తున్న జీవన్ కుమార్

కరోనా మొదటి వేవ్ సమయంలో తన సేవా కార్యక్రమాలతో పలువురికి అండగా నిలిచినా నటుడు జీవన్ కుమార్ సెకండ్ వేవ్ లో కూడా అదే స్ఫూర్తి కొనసాగిస్తున్నారు. రోజుకు 300 కి పైగా కరోనా రోగులకు పోషక విలువలున్న భోజనం అందించారు. ఇవే కాకుండా కొత్తగూడెం, భద్రాద్రి పరిసర ప్రాంతాలలో ఉన్న గిరిజిన గ్రామాలకు 10 వేల కేజీల బియ్యం సరఫరా చేసారు. నిర్మల్ జిల్లా లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో నిత్యావసరాలు, మాస్క్ లను పంపిణీ చేసారు. జీవన్ కుమార్ చేస్తున్న సహాయక చర్యలకు హీరో సాయి దరమ్ తేజ్ తో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఈ రోజు ఔత్సాహిక దర్శకులకు, రచయితలకు, మా అసోసియేషన్ లో మెంబర్స్ కి జీవన్ నిత్యావసరాలను అందించారు.

నటుడు దర్శకుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. నటుడు జీవన్ కుమార్ చేస్తున్న సాయం చాలా గొప్పది. కరోనా కష్టకాలంలో పోలీసులు, డాక్టర్స్, పారిశ్రామిక కార్యకర్తలతో పాటు జీవన్ కుమార్ వంటి దాతలు చేస్తున్న సాయం చాలా మంది జీవనం సాగించేందుకు సహాయ పడుతుంది. ఆయన చేస్తున్న సేవలు చాలామందికి ధైర్యాన్ని నింపుతున్నాయి. ఇప్పడు నిత్యావసరాలను అందుకున్న ప్రతి సభ్యుడు కుటుంబంలో జీవన్ కుమార్ ఒక సభ్యుడయ్యాడు.  అన్నారు.

నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ.. నా స్నేహితుడు నాగార్జున  ద్వారా కాశీ విశ్వనాథ్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.  నేను చేస్తున్న సహాయం కు అండగా నిలిచిన హీరో సాయి ధరమ్ తేజ్ కి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నేను చేస్తున్న సహాయక చర్యలకు అండగా నిలిచినందుకు అండగా నిలిచిన హీరో నవీన్ కు, దర్శకుడు తరుణ్ భాస్కర్ కి చాలా థాంక్స్..నాకు వచ్చిన రిక్వెస్ట్ ల ప్రకారం సహాయం చేసుకుంటూ వచ్చాను. ఈ నెలన్నర రోజుల నుండి చాలా మందికి సహాయం అందివ్వగలిగాను. అలాగే  కొన్ని ఎన్ జీ వో లకు కూడా సహాయం అందించా’నని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular