తెలంగాణా క్యాబినెట్ జూన్ 8న మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ భేటి జరగనుంది. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్, రైతు బంధు, వ్యవసాయ పనులు తదితర అంశాలమీద క్యాబినెట్ చర్చించనున్నది.
లాక్ డౌన్ ను మరోసారి పొడిగిస్తూనే గతంలో ఇచ్చిన సడలింపులకు అదనంగా మరి కొన్ని గంటలపాటు అంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించి మిగిలిన సమయాన్ని సడలింపు ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి అలోచిస్తున్నట్లు తెలిసింది.
ఈనెల 11న సమావేశమైన కేబినేట్ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విదుస్తూ నిర్ణయం తీసుకుంది. మరోసారి 20న క్యాబినెట్ సమావేశమై మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. అయితే 18న ముఖ్యమంత్రి మంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడి లాక్ డౌన్ ను 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ౩౦న సమావేశమైన క్యాబినెట్ లాక్ డౌన్ 10 రోజులపాటు పొడిగిస్తూ సడలింపు సమయాన్ని మరో నాలుగు గంటలపాటు పెంచింది.