జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర – ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధనం, దీక్ష గ్రహణం తదితర పూజలు చేసి మహా శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో మొదటి రోజులో భాగంగా ఉదయం నుంచే భక్తులు గోదావరిలో స్నానం చేసి గోదావరి మాతకు ప్రత్యేక దీపాలు వెలిగించి కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.