Saturday, November 23, 2024
HomeTrending Newsగవర్నర్ ను అవమానించలేదు - మంత్రి హరీష్

గవర్నర్ ను అవమానించలేదు – మంత్రి హరీష్

గవర్నర్ ని అవమానం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, రాజ్ భవన్ కి కాషాయ రంగు ఎందుకు పులుముతున్నారని మంత్రి హరీష్ రావు బిజెపి నేతలను ప్రశ్నించారు. గవర్నర్ కి ఇబ్బంది ఉంటే సీఎం తో… సెక్రటేరియట్ తో మాట్లాడుతారన్నారు. కేసులు మా మీద కాదు.. బీజేపీ నేతల మీద వేయాలని మంత్రి ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో హితవు పలికారు. రాజ్ భవన్ కి కాషాయ రంగు పులిమి పని చేస్తుంది బీజేపీ అని ఆరోపించిన మంత్రి హరీష్ గవర్నర్ ని అడ్డం పెట్టుకొని సర్కార్ నీ ఇబ్బంది పెడుతున్నట్టు బీజేపీ నేతలే బయట పడుతున్నారని అన్నారు.

బీజేపీ నేతలు అవగాహన రాహిత్యం గా మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడాలో తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గవర్నర్ మహిళా కదా అందుకే సభకు పిలవడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు, అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్నే అవమానించాయని గుర్తు చేశారు. అస్సాం సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ బండి సంజయ్ సమర్థిస్తారా అన్నారు. మమత బెనర్జీ మహిళా సీఎం నీ బీజేపీ నేతలు గవర్నర్ ని అడ్డం పెట్టుకొని వేధించడం లేదా .? అన్నారు. రాష్ట్ర గవర్నర్ ని అవమానించే ఉద్దేశం మాకు లేదని మంత్రి స్పష్టం చేశారు. భేటీ బచావో ..నినాదం మీ మోడిదే అన్న మంత్రి హరీష్ భేటీ బచావో పథకం కి ప్రభుత్వం కేటాయించిన నిధులు 80 శాతం మోడీ ప్రచారం కే కేటాయించారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి: మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్