Wednesday, March 11, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్21 రోజుల్లో రైతుల అకౌంట్‌లో సొమ్ము: కన్నబాబు

21 రోజుల్లో రైతుల అకౌంట్‌లో సొమ్ము: కన్నబాబు

రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును 21 రోజుల్లో రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిల్లర్లు, దళారులను రైతులు నమ్మొద్దని సూచించారు. ఆర్‌బీకేలకు వెళ్లి కనీస మద్దతు ధరకే ధాన్యం విక్రయించుకోవాలన్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రకాలనే రైతులు సాగు చేయాలి అందుకు సంబంధించిన విత్తనాలను కూడా సిద్ధం చేశామని తెలిపారు.

వసాయ సలహా మండలి నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. వ్యవసాయ సలహా మండలిలో రైతులను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. సలహా మండలితో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular