Stand-up: ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్‌లైన్. ఈచిత్రం ద్వారా శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈనెల 18న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను, పాటలను రామానాయుడు స్టూడియోలో విలేకరులకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ :ఎంతో కష్టపడి ఎంజాయ్ చేస్తూ చేశాం. మీరు చూసినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నారు. మీరంతా కుటుంబ సభ్యులతో రెండు గంటలు వచ్చి ఎంజాయ్ చేయండి. అన్ని ఎమోషన్స్ కూ కనెక్ట్ అవుతారు. మార్చి18న థియేటర్లో సినిమాను చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి అని తెలిపారు.
కథానాయిక వర్ష మాట్లాడుతూ “మిడిల్ క్లాస్ మెలోడిస్ కు ముందే నాకు శాంటో ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్. మంచి నిర్మాతలు ఈ సినిమా తీశారు. నేను పని చేసిన కో స్టార్‌లో రాజ్ తరుణ్ స్వీట్ పర్సన్. మనాలిలో షూట్ చేస్తున్నప్పుడు కాస్ట్యూమ్స్ విషయంలో ఇబ్బంది ఎదురైంది. అప్పుడు రాజ్ గ్రహించి వెంటనే సాల్వ్ చేశాడు. ఇందులో సాంగ్స్ బాగున్నాయి. ఈశ్వర్ మాస్టర్ ఈ సినిమాకు బెస్ట్ మేన్ అని చెప్పగలను” అన్నారు.
దర్శకుడు శాంటో మాట్లాడుతూ “రాజ్ తరుణ్ కు ఇది 15 సినిమా. అయినా తొలి సినిమాలాగా ఆడిషన్ చేయడం విశేషం. వర్క్ షాప్ కూడా చేసి మంచి ఔట్‌పుట్ ఇచ్చాడు. ఓసారి థియేటర్‌లో `చూసీ చూడంగానే` సినిమా చూశాక తను బయటకు వచ్చింది. అప్పుడు ఆమెను చూసి నా కథకు సరిపోతుందని ఫిక్స్ అయ్యాను. తెలుగు రాకపోయినా డిక్షన్ బాగా నేర్చుకుని పలికింది. అలాగే ఇతర టెక్నీషియన్స్ కూడా నచ్చి ఎంపిక చేశాను. శ్రీకర్ నాకు `కేరాఫ్ కంచెరపాలెం`నుంచి తెలుసు. ఇందులో 6 పాటలున్నాయి. అందులో `అలా ఇలా..` అనేది నా ఫేవరేట్ సాంగ్. త్వరలో విడుదల చేస్తాం. ఈ సినిమా కథ వైజాగ్ నేపథ్యంలో వుంటుంది. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు నా లైఫ్‌లో చూసిన వారిని ఇందులోకి తెచ్చాను. మురళీ శర్మ, ఇంద్రజ గారు బిజీ ఆ ర్టిస్టులయినప్పటికీ కథ చెప్పగానే వెంటనే అంగీకరించి సపోర్ట్ చేశారు’అని తెలియజేశారు.