Saturday, November 23, 2024
HomeTrending Newsఅక్కడికే వెళ్ళండి: బొత్సకు అచ్చెన్న కౌంటర్

అక్కడికే వెళ్ళండి: బొత్సకు అచ్చెన్న కౌంటర్

Be responsible: మంత్రులు ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి విలువ ఉండాలని, ప్రజలు హర్షించాలని… అలాకాకుండా బాధ్యతారహితంగా మాట్లాడడం సరికాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. హైదరాబాదే ఇంకా తమ రాజధానిగా ఉందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.  హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో రెండేళ్లపాటు సమయం ఉంది కాబట్టి వారికి ఇష్టమైతే అక్కడకు వెళ్ళవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో మన పాలన సాగాలనే ఉద్దేశంతోనే తాము ఇక్కడకు వచ్చామని, అష్టకష్టాలు…ఇబ్బందులు పడి ఒక రాజధాని అట్టుకుని ఇక్కడినుంచి పరిపాలన మొదలు పెట్టామని గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ ధర్మాసనం రాజధానిపై స్పష్టమైన తీర్పుచెప్పిన తరువాత కూడా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

గవర్నర్ ప్రసంగాన్ని సభలో టిడిపి సభ్యులు అడ్డుకోవడాన్ని, నినాదాలు చేయడాన్ని అచ్చెన్న సమర్ధించుకున్నారు.

న్యాయ వ్యవస్థపై ప్రభుత్వం దాడి చేసినా గవర్నర్ రాష్ట్ర పెద్దగా ఏరోజూ మాట్లాడలేదని…

గవర్నర్ కు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది, అయినా అయన స్పందించలేదని… ఈ విషయమై తాము హెచ్చరించినా పట్టించుకోలేదని….

రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తున్నా ఏనాడూ పిలిచి మందలించలేదని…

మూడు రాజధానుల బిల్లులోనూ గవర్నర్ తప్పు చేశారని, ఈ బిల్లులు సరికాదని కోర్టులు కూడా చెప్పాయని…

ఎన్నికల సంఘంపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని…

సిఆర్డీఏ చట్టాన్ని రాత్రికి రాత్రే రద్దు చేసినా పట్టించుకోలేదని, అందరూ ఒప్పుకున్న చట్టాన్ని ఎలా రద్దు చేస్తారని గవర్నర్ ఏనాడూ ప్రశ్నించలేదని, పైగా సంతకం చేశారని….

అందుకే తాము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: వారిది క్షణికావేశం: టిడిపిపై బొత్స

RELATED ARTICLES

Most Popular

న్యూస్