Dhumki: యంగ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన కథలు ఎంచుకుని వరుసగా సినిమాలు చేస్తున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ ‘ఫలక్ నామా దాస్’, ‘హిట్’ చిత్రాలతో సక్సెస్ సాధించిన విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు విశ్వక్ సేన్ కొత్త సినిమా ధమ్కీ ఈ రోజు రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.
పాగల్ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాగల్ మూవీలో కథానాయిక నివేథ పేతురాజ్ ఈ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.