Sunday, June 14, 2026
HomeTrending Newsమండలి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుత్తా

మండలి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుత్తా

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ శాసన మండలిలో శాసన మండలి సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రి నేడు చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు.ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు,వేముల ప్రశాంత్ రెడ్డి,మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్,జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ ,శ్రీనివాస్ గౌడ్,ఇంద్రకరణ్ రెడ్డి,మల్లారెడ్డి,ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు,రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular