Sunday, June 14, 2026
Homeసినిమాషూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ 'అను'

షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ ‘అను’

Anu wrapped: తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘అను’. ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. హొలీ సందర్భంగా ఈ చిత్రంలోని లిరికర్ సాంగ్ ‘ఏమైంది ఏమో’ సాంగ్ విడుదల చేశారు.  మిగిలిన సాంగ్స్ కూడా త్వరలో విడుదల కానున్నాయి.
హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ తెలియజేసింది.  కథ, కథనాలు బాగున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని, అలాగే మా ‘అను’ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉందని హీరో ప్రశాంత్ కార్తిక్ తెలిపారు. దర్శకులు భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ ఈ చిత్రంలో మంచి పాత్రల్లో నటించారని, సినిమా ఔట్ ఫుట్ బాగా వచ్చిందని, త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular