Thursday, June 11, 2026
HomeTrending Newsవ్యవసాయక్షేత్రంలో మంత్రులతో సీఎం భేటీ

వ్యవసాయక్షేత్రంలో మంత్రులతో సీఎం భేటీ

రాష్ట్ర మంత్రులతో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ సమావేశంలో ఉద్యోగ నియామకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గెలుపు, వినూత్నంగా పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రావటానికి కారణాలు, కేంద్రప్రభుత్వంతో సంబంధాలు తదితర అంశాలపై మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular