I Can’t: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లోనే ‘జనగణమన’ చేయాలనుకున్నారు. అయితే.. షూటింగ్ లోకేషన్స్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో ప్రస్తుతానికి ‘జనగణమన’ చిత్రాన్ని వాయిదా వేసి వెంటనే శివ నిర్వాణ డైరెక్షన్ లో ప్రేమకథా చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారు విజయ్.
అయితే.. ఈ సినిమాలో విజయ్ సరసన నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని ఎంపిక చేయాలి అనుకున్నారు. విజయ్, కైరా మంచి ఫ్రెండ్స్. అయినప్పటికీ.. విజయ్ మూవీలో నటించేందుకు కైరా అద్వానీ నో చెప్పింది. కారణం ఏంటంటే.. కైరా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. అందుచేత డేట్స్ ప్రాబ్లమ్ వలన విజయ్ మూవీకి నో చెప్పింది.
కైరా అద్వానీ నో చెప్పడంతో సమంతను ఫైనల్ చేశారు మేకర్స్. కాశ్మీర్ నేపధ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపకుంటోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read : ‘జనగణమన’ తర్వాత పూరి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్