ఆర్ఆర్ఆర్… దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో.. భారతదేశంలోనే భారీ మూవీగా రూపొందిన చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందింది. ఈ సంచలన చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించారు. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. అయితే.. దానయ్య తన వారసుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు.
శేఖర్ కమ్ముల, శ్రీవాస్, మారుతి తదితర దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు గట్టిగా వినిపిస్తోంది. అ, కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో సక్సెస్ సాధించి విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా హను మాన్ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదే బ్యానర్లో కళ్యాణ్ ని హీరోగా పరిచయం అవుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. హను మాన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ.. కళ్యాణ్ సినిమా ప్రారంభిస్తారని సమాచారం. మరి.. ఈసారైనా ఎలాంటి అడ్డంకులు రాకుండా కళ్యాణ్, ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి వెళుతుందని ఆశిద్దాం.