As per Constitution: హైకోర్టు తీర్పుపై చంద్రబాబు మీడియాతో కాకుండా శాసనసభలో సభలో మాట్లాడాల్సి ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు సభలో జరిగిన చర్చపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్స కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని, ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని, తాము కూడా రాజ్యంగబద్ధంగానే చట్టాలు తెచ్చామని, తమకున్న అధికారాలతోనే మూడు రాజధానుల బిల్లు తెచ్చామని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయబోమని, ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు.
మూడు రాజధానులపై ప్రజా తీర్పు కోరాలంటూ బాబు చేసిన డిమాండ్ ను బొత్స ఎద్దేవా చేశారు. వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేసి ప్రజాభిప్రాయం కోరాలని సవాల్ చేశారు. అమరావతిలో ఇంకా 7300 ఎకరాలు మాత్రమే మిగిలిందని, అది అమ్మితే లక్ష కోట్లు వస్తుందా అని బొత్స ప్రశ్నించారు.
అధికారం దక్కలేదనే ఆక్రోశం, కడుపు మంటతో చంద్రబాబు మాట్లాడుతున్నారని బొత్స తీవ్రంగా మండిపడ్డారు. ఆయనలాగా తాను మాట్లాడలేనన్నారు. ఎన్ఠీఆర్ కౌన్సిల్ రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్రంలో సీబీఐను వద్దన్న వ్యక్తి చంద్రబాబు అంటూ బొత్స గుర్తు చేశారు.
Also Read : ఇష్టానుసారం మాట్లాడతారా? బాబు