RRR-Sukku: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ అభిమానులు ఆర్ఆర్ఆర్ అద్భుతం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు సైతం రాజమౌళిని అభినందిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నారు.
తాజాగా పుష్ప సినిమాతో బాలీవుడ్ ని షేక్ చేసిన సుకుమార్ ఆర్ఆర్ఆర్ మూవీ గురించి స్పందిస్తూ.. రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశారు. ఇంతకీ సుకుమార్ ఏమన్నారంటే.. మీరు పక్కనే వున్నా.. మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేం ఆకాశంలో వున్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. రాజమౌళి సార్.. మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు. మేం చూడగలం అంతే.. అని సుకుమార్ కవిత రూపంలో రాజమౌళి పై ఉన్న అభిమానాన్ని తెలియచేశారు.
Also Read : ఇక నుంచి ‘నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్’