Friday, November 22, 2024
HomeTrending Newsసవరించిన అంచనాలు ఆమోదించండి: సిఎం జగన్

సవరించిన అంచనాలు ఆమోదించండి: సిఎం జగన్

పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖర్చు చేస్తున్న నిధులను జాప్యం లేకుండా రీయింబర్స్‌ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కోరారు.  నిధుల విడుదలను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దన్న జగన్ కోరారు.  జాతీయ ప్రాజెక్టుల విషయంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటర్‌ సప్లైని కూడా ఇరిగేషన్‌ ప్రాజెక్టులో భాగంగా చూడాలని కోరిన సీఎం.

పోలవరం ప్రాజెక్టు అథారిటీతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి ( టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం 55,656.87 కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని కేంద్రమంత్రిని కోరారు జగన్. 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని విన్నవించారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం తరలించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.  హైదరాబాద్‌లో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు లేవని, ప్రాజెక్టు పర్యవేక్షణ, పరిశీలనకోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్‌ నుంచి రావడం కష్టం అవుతోందని, అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలని కోరారు.

అంతకుముందు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.  పోలవరం ప్రాజెక్టులో స్టాకింగ్‌ పనులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల్లో చిన్న చిన్న అంశాలు మిగిలిపోయాయని వెంటనే పరిష్కరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్