Two Masses: నట సింహ నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోకు రవితేజ గెస్ట్ గా వెళ్లారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల మధ్యలో కలసి సినిమా చేద్దామనుకున్నారు. బాలకృష్ణ హీరోగా రవితేజ డైరెక్షన్ చేయాలనుకున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని రవితేజ చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మే 27న ఈ సినిమా విడుదల కానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ లేదా జులైలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
ఇందులో రెండో హీరో క్యారెక్టర్ ఉందట. దీనికి మొదట కళ్యాణ్ రామ్ ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి కానీ… తాజా సమాచారం ప్రకారం.. రవితేజతో చేయించాలని ఫిక్స్ అయ్యారట. అనిల్ రావిపూడి రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుచేత అనిల్ రావిపూడి చెప్పిన వెంటనే బాలయ్య సినిమాలో నటించేందుకు రవితేజ ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరి.. ఇదే కనుక నిజమైతే.. ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.
Also Read : పవర్ స్టార్ – అనిల్ రావిపూడి మూవీ.?