Wednesday, April 2, 2025
Homeసినిమాశివుడంటే.. సీనియ‌ర్ న‌టుడు బాలయ్యే.

శివుడంటే.. సీనియ‌ర్ న‌టుడు బాలయ్యే.

Sivudu- Balayya: శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలంటే ఎన్టీఆర్‌ ఎలా గుర్తుకు వస్తారో.. సినిమాలో శివుడు పాత్ర అనగానే సీనియ‌ర్ బాలయ్య గుర్తుకు వస్తారు. మిగిలిన నటుల కంటే అత్యధికంగా అంటే పదికి పైగా చిత్రాల్లో బాలయ్య శివుడి పాత్రల్లో నటించారు. ఆయన తొలిసారిగా 1962లో వచ్చిన పార్వతీ కళ్యాణం చిత్రంలో శివుడి పాత్రలో కనిపించారు. ఆ చిత్రంలో ఆయన నిజమైన పామునే ఆయన మెడలో వేసుకుని నటించారు.

ఆతర్వాత మల్లమ్మ కథ, భక్త కన్నప్ప, మోహినీ రుక్మాంగద, మనోరమ, జగన్మాత, అష్టలక్ష్మీ వైభవం తదితర చిత్రాల్లో శివుడిగా నటించి మెప్పించారు. అలాగే కృష్ణ ప్రేమ చిత్రంలో శ్రీకృష్ణుడిగా బాలయ్య కనిపించారు. కృష్ణుడు అంటే ఎన్టీఆరే అని అందరూ ఫిక్స్‌ అయిన తరుణంలో ఆ పాత్ర పోషించడానికి బాలయ్య భయపడ్డారు. కానీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ధైర్యం చెప్పి ఆయనతో ఆ వేషం వేయించారు.

సీనియర్‌ నటుడు బాలయ్య శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలయ్య దాదాపు 300 లు చిత్రాలలో విభిన్న పాత్రలతో అలరించిన ఆయన నంది అవార్డుతో పాటు రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు. బాలయ్య మరణవార్త విన్న సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్