కరోనా కట్టడి లో భాగంగా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‘‘వయసుతో నిమిత్తం లేకుండా అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నాం. వ్యాక్సినేషన్ కోసం 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. భారత్ బయోటెక్, రెడ్డీ ల్యాబ్స్ సహా కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి.. పూర్తిగా కోలుకున్న తర్వాత అధికారులతో సమీక్షిస్తా. వ్యాక్సినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తా. రెమిడిసివర్, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.