Tuesday, September 24, 2024
HomeTrending Newsపైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం కేసీఆర్ ది - బిజెపి

పైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం కేసీఆర్ ది – బిజెపి

Alampur : బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మే వారిని బొక్కలో తోస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. నీళ్లు లేక అల్లాడుతున్న గద్వాల జిల్లా అలంపూర్ ప్రజలకు ఆర్డీఎస్ ద్వారా సాగు, తాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, డీకే స్నిగ్దా రెడ్డితోపాటు స్థానిక నేతలు యాదగిరిరెడ్డి, జగదీష్ రెడ్డి, కేకే రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

కేసీఆర్ అబద్దాల పుణ్యమా? అని రాజకీయ పార్టీల నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. మేం ఓట్ల కోసం రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఎండలో తిరుగుతున్నం. యాడికి పోయినా నీళ్ల సమస్యే చెబుతున్నరు. బీజేపోళ్లకు ఏం పన్లేదు… పచ్చగా ఉన్న పాలమూరులో చిచ్చు పెట్టడానికి వస్తున్నారని కేసీఆర్ అంటున్నడు…. ఎక్కడో ఉన్న కాళేశ్వరం…. 200 కి.మీల దూరంలో ఉన్న ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు. కానీ ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ కు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణలో ఏ ఒక్క రైతు లాభం కోసం వ్యవసాయం చేస్తలేడు. నకిలీ పత్తి విత్తనాలతో ఈ ప్రాంత ప్రజలు తల్లిడిల్లి పోతున్నరు.
మిర్చికి తెగులొస్తే సాయం చేయలేదు. పండిన మిర్చిని అమ్ముకుందామంటే… మార్కెట్ లేదు. దళారులకు అమ్మి మోసపోతున్నరు. ఏనాడూ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. రేషన్ బియ్యం డబ్బులన్నీ కేంద్రం ఇచ్చేవే. కిలో బియ్యానికి 29 రూపాయలు కేంద్రమే ఇస్తోంది. కేసీఆర్ భరించేది ఒక్క రూపాయి మాత్రమే. కేసీఆర్ కుటుంబంలో 5గురికి పదవులొచ్చాయి. కానీ యువకులకు మాత్రం ఉద్యోగాలివ్వడం లేదు. ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ సాధించుకుంది? తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసినోళ్లంతా పేదోళ్లే… ఇప్పుడు రాజ్యమేలుతోంది పెద్దోళ్లే.

పేదలంటే కేసీఆర్ కు చులకన. డబ్బులిస్తే ఓట్లేస్తారనే అహంకారంతో ఉన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు చెంప చెళ్లుమన్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ నీళ్లిచ్చి తీరుతాం. నెట్టెంపాడు నీళ్లిస్తాం.ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడతలో పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇఛ్చాం. అమలు చేసి తీరుతాం.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..
ఆలంపూర్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ అభివృద్ధి చేసిందే లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వకపోగా.. మనకు మన ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న బెడ్ రూం ఇళ్లు కూడా రాకుండ చేస్తుండు. రూ.600 కోట్లు ఇక్కడ పెడితే ఆర్డీఎస్ పూర్తయ్యేది.. కానీ ఆలంపూర్ నియోజకవర్గంలో పైసా ఖర్చు పెట్టరు. మొత్తం అంతా తీసుకుపోయి కాళేశ్వరంలో రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. నీళ్లు ఇవ్వకపోయినా.. నిధులు మంజూరు చేయకపోయినా.. పనులు చేయకపోయినా.. పైసలు పెడితే ఓట్లు వేస్తరు అనుకుంటున్నడు. నీకు ఇళ్లు రాదు. రైతుబంధు రాదు.. ఆశలు చూపి, బెదిరించి ఓట్లు వేయించుకున్నరు. అందరు ప్రజా ప్రతినిధులు టీఆర్ ఎస్ వాళ్లుంటేనే అభివృద్ధి అన్నడు.. కానీ ఏమైంది..? మన ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మీరందరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ కష్టాలు తీరాలంటే బిజెపి అధికారంలోకి రావాలి. తెలంగాణ రైతన్నలు, అక్కలు, చెల్లెళ్లు ఏకధాటిపై నిలిచి అక్కడ నరేంద్ర మోదీ సర్కారును మరోసారి.. ఇక్కడ బిజెపి సర్కారు కలిపి డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసుకోవాలి.

Also Read : కేసీఆర్ పాలన పోవడం- బిజెపి రావడం ఖాయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్