రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దర్శనానికి వస్తున్న భక్తుల ఇబ్బందులను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భూసేకరణ పనులు ప్రారంభించారన్నారు.
ముడి చెరువులో 35 ఎకరాలు ఇప్పటికే సేకరణ పూర్తయిందని మంత్రి తెలిపారు. బద్ది పోచమ్మ ఆలయం విస్తరణకు సైతం భూసేకరణ కూడా పూర్తి చేశారన్నారు. యాదాద్రి ఆలయంలాగే సీఎం కేసీఆర్ వేములవాడ, కొండగట్టు ధర్మపురి, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలనుకూడా అభివృద్ధి చేస్తారని చేస్తారని స్పష్టం చేశారు. కొంత ఆలస్యం అయినప్పటకి అభివృద్ధి మాత్రం జరిగి తీరుతుందన్నారు.
Also Read : వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం