Saturday, November 23, 2024
HomeTrending Newsఎంపీకి సైబర్ నేరగాళ్ళ టోకరా!

ఎంపీకి సైబర్ నేరగాళ్ళ టోకరా!

Cyber Crime: సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. వారి మోసాలకు సామాన్య మానవులు, విద్యావంతులతో పాటు ఆఖరికి చట్ట సభల సభ్యులు కూడా మోసపోతున్నారు.  కర్నూలు ఎంపీ  సంజీవ్ కుమార్ కూడా ఈ జాబితాలో చేరారు.  మీ బ్యాంకు ఖాతా స్థంభించిందని, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందని, పాన్‌ నంబరుతో సహా అప్‌డేట్‌ చేసుకోవాలంటూ అయన మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని నిజమే అనుకున్న సంజీవ్ కుమార్ ఆ మెసేజ్ లోని లింకును ఓపెన్ చేసి వివరాలను నమోదు చేసి పంపారు.  ఓటీపీ నంబర్లు వచ్చాయి. ఆ తర్వాత ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకుని ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకున్నాడు.

తీరా చూస్తే ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,700, రూ.48,999 చొప్పున రెండుసార్లు డబ్బులు డ్రా చేశాడు నిందితుడు. డబ్బులు డ్రా  అయినట్లు మెసేజ్ రావడంతో ఎంపీ సంజీవ్ బిత్తరపోవాల్సి వచ్చింది.  అనుమానం వచ్చి బ్యాంకుకు ఫోన్‌ చేయగా విషయం తెలిసింది. దీనిపై ఎంపీ సంజీవ్‌ కుమార్‌ కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్