Saturday, November 23, 2024
Homeతెలంగాణఅభివృద్ధి కార్యక్రమాలపై సీఎస్ దిశా నిర్దేశం

అభివృద్ధి కార్యక్రమాలపై సీఎస్ దిశా నిర్దేశం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు విజన్ మేరకు అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాల్లో రాత్రి బస చేసి పారిశుద్ధ్యం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించాలని ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామ సభల నిర్వహణ, ప్రగతి నివేదికల తయారీ, సీజనల్ కేలండర్ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.

రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లలో పెద్దయెత్తున మొక్కల పెంపకం, జిల్లాల్లో అన్ని రహదారుల వెంట మల్టీలెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పట్టణాల్లో ఖాళీ స్థలాల్లో పెద్దయెత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత  కార్యాలయాల కంప్లెక్స్లలో పచ్చదనం, తదితర అంశాలను సీఎస్ పరిశీలించారు. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం ,మిగిలిన గ్రామాల్లో పల్లె ప్రకతి వనాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ల ను ఆదేశించారు.

ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్లకు స్థలాలు అప్పగించడం తదితర అంశాలను సీఎస్ చర్చించారు. వ్యాధుల నియంత్రణపై కూడా అధికారులు ఎప్పటి్కప్పుడు పరిశీలించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి  అర్వింద్ కుమార్,  పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ,  జిహెచ్ ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, సిఐజి వి.శేషాద్రి,  పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు,  అటవీ శాఖ  పిసిసిఎఫ్ శోభ,  పిసిసిఎఫ్, (ఎస్ ఎఫ్) ఆర్.యం.డోబ్రియల్, సి.యం ఓఎస్డి ప్రియాంకా వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్