People wants: ఎన్నికల పొత్తులపై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని, దీనికి ఇంకా చాల సమయం ఉందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని, వారే పొత్తులు కోరుకుంటున్నారని వెల్లడించారు. కేవలం పొత్తులతోనే తాము ప్రతిసారీ విజయం సాధించలేదని, పొత్తులతో తాము ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అయన గుర్తు చేశారు.
కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు, ఈ సందర్భంగా పొత్తులపై ఇటీవల సాగుతున్న రాజకీయ చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రాజకీయంగా కొన్ని తప్పులు చేశానని అంగీకరించిన చంద్రబాబు రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని మార్చేయాలని అనుకున్నానని, అది కొంత మేర పార్టీకి నష్టం చేసిందని అభిప్రాయపడ్డారు. తాను కూడా కొన్నిసార్లు బలహీనతలకు గురయ్యానని, ప్రస్తుతం తన పరిస్థితి రాజకీయ వైకుంఠపాళిలా తయారైందని అన్నారు.
Also Read : గెటౌట్ చంద్రబాబు – షటప్ చంద్రబాబు: అంబటి