Thursday, March 19, 2026
Homeసినిమాఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీలో క‌మ‌ల్ హాస‌న్?

ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీలో క‌మ‌ల్ హాస‌న్?

Komaram with Kamal: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ త‌ర్వాత కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.  జూన్ లేదా జులై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్నారు. ఈ భారీ, క్రేజీ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్నారు. ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ న‌టించ‌నున్నారు అనే ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉందట. ఇది  సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందట. అందుకే ఆ పాత్ర కోసం యూనివ‌ర్శిల్ హీరో కమల్ హాసన్ ను ఒప్పించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తునట్టు టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే.. ఆలియా భ‌ట్ అనుకున్నారు కానీ.. ఆమె త‌ప్పుకుంది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది టీమ్.

ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను ప్రశాంత్ నీల్ అక్టోబర్‌ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్‌ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మ‌రి.. ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular